- నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి నవతెలంగాణ-నిర్మల్ మున్సిపల్‌లో వార్డుల వారీగా ఓటరు జాబితాను ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నిర్మల్ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన, సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై బిల్ కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వార్డుల పునర్విభజనలో భాగంగా బిల్ కలెక్టర్లు ప్రతి వార్డులో రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే 9వ తేదీ వరకు స్వీకరించి విచారణ చేపట్టాలన్నారు. ఫొటో ఓటరు జాబితాను అనుసరించి ప్రతి ఇంట్లో ఓటర్లర్లను పరిశీలించాలని తెలిపారు. ప్రతి వార్డులోనూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇంటి నెంబర్ ప్రకారం పరిశీలించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్, టీపీఓ సుమలత, ఆర్‌ఓ శ్రీనివాస్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.