నవతెలంగాణ-నిర్మల్ ఖానాపూర్, పెంబి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన ఎంఈఓ (విద్యాధికారిపై) సమగ్ర విచారణ చేపట్టి విధుల నుంచి తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం ఏర్పాటుచేసిన సమా వేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేశ్ మాట్లాడారు. మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మార్సీ, పాఠశాలల నిర్వహణ నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా అక్రమ డిప్యూటేషన్లు పద్ధతిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. విధులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యా యులపై చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చ రించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు రాజు, ఉదరుకుమార్ పాల్గొన్నారు..