- ఆందోళనలు - జైనూర్, సిర్పూర్(యు)
లింగాపూర్ మండలంలో టేకు లక్ష్మీపై అత్యాచారం చేసి హత్య చేసి నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు జరిగాయి. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో బంద్ పాటించారు. వాంకిడిలో రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్ ఆధర్యంలో ధర్నాకు దిగారు. లింగాపూర్ మండల కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. మండల వ్యాప్తంగా బంద్ పాటించారు. సిర్పూర్(యు) మండల కేంద్రంలో ఆదివాసీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో కుమురంభీంచౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. దుకుణాలను మూసి ఉంచారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ దిశ కేసులో స్పందించినట్లుగానే టేకులక్ష్మీ కేసులో కూడా పోలీసులు స్పందించాలని కోరారు. జైనూర్‌లోనూ మార్కెట్ బంద్ చేశారు. మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించారు. విచారణ జరుగుతోందని, నిందితులకు శిక్ష పడేలా చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే టేకు లక్ష్మీ ఇద్దరు పిల్లలను ఉట్నూర్ గురుకులంలో చేర్పించామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్మల్ కలెక్టర్‌కు సూచించినట్టు తెలిపారు. దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఇంతియాజ్‌లాలా, జైనూర్ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కనక యాదవ్‌రావు, మహిళా సంఘం నాయకులు రాజమణి, ఆదివాసీ తుడుందెబ్బ మండలాధ్యక్షుడు అడ అమృత్, ప్రధాన కార్యదర్శి గంగారాం, వంజారీ సంఘం నాయకులు సుపుత్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు లాహెత్‌ఖాన్, రమేష్, యువజన సంఘం నాయకులు అజ్జులాల, సతీష్ సిర్పూర్(యు)లో ఆదివాసీ, బంజారా నాయకులు ఆత్రం భగవంత్‌రావు, యాదవ్ రమేష్, ప్రకాష్, ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వాంకిడి : ఎల్లాపటార్ అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో హైదరాబాద్ - నాగ్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు అశోక్, విలాస్, విజరు, పోశం, కార్తీక్, శంకర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌రూరల్ : టేకు లకీëపై లైంగిక దాడి, హత్య ఘటనపై బహుజన ప్రజాప్రతినిధులు స్పందించాలని, టేకు లకీë కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాట్లాడుతూ దిశ ఘటనపై వారం రోజుల్లో స్పందించిన పోలీసులు వరంగల్, లింగాపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా దళిత, బహుజన ప్రజాప్రతినిధులు స్పందించి లింగాపూర్ ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కాంబ్లే బాలాజీ మాదిగ, జిల్లా నాయకులు బిరుదల లాజర్, రాజు పాల్గొన్నారు.
Authorization