నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
విద్యార్థులను తీర్చిదిద్దడంలో రికిల్‌పోర్డ్ పాఠశాల ముందంజలో ఉందని హైద్రాబాద్ జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. శని వారం రాంపల్లి గ్రామంలోని రికిల్‌పోర్డ్ ఇంట ర్నేషనల్ పాఠశాల 8వ వార్షికోత్సవ కార్యాక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా చదవాలని పేర్కోన్నారు. రికిల్‌పోర్డ్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు భవిష్యత్‌లో గొప్ప వ్యక్తులుగా రాణించాల న్నారు. నేటి బాలలే రేపటి పౌరులని వారిని ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని దానకిషోర్ తెలిపారు.రికిల్‌పోర్డు చైర్మెన్ ఉదరుకుమార్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను ఉన్నత విద్యావం తు లుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తా మని వివరించారు. అంతకు మునుపు విద్యా ర్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్ర మాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్‌పాల్ విద్యా స్రవంతి, సినీ నటుడు రాజా తదితరులు పాల్గొన్నారు.
Authorization