నవతెలంగాణ-కాగజ్‌నగర్ పట్టణంలోని విజయ ఆస్పత్రిలో శనివారం వైద్యులు రమేష్‌కుమార్ అరుదైన శస్త్రచికిత్స చేసి మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడారు. చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దుర్వ లస్మయ్య-రత్నక్కలు భార్యాభర్తలు. రత్నక్క (50) గత కొన్నాళ్ల నుండి కడుపు నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా నొప్పి మాత్రలు వేసుకుంటూ వస్తోంది. గత రెండు నెలల నుండి కడుపు నొప్పి తీవ్రం కావడం, కడుపు ఉబ్బరం కావడంతో శనివారం కాగజ్‌నగర్‌లోని విజయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు రమేష్‌కమార్ స్కానింగ్ చేయగా ఆమె కడుపులో పెద్ద కణితి (ఓవరిన్ సిస్ట్) ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు ఏకధాటిగా నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులోనుండి ఎనిమిది కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. కణితి కారణంగా ఆమె కడుపు ఉబ్బరమై ఆకలి లేకపోవడం, తిన్న ఆహారంజీర్ణం కాకపోవడం వంటిసమస్యలను ఎదుర్కొందనీ, స్కానింగ్‌లో కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించినట్లు వైద్యులు రమేష్‌కుమార్ తెలిపారు.