- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యోగాలకు గండికొట్టే జీవో నెంబర్ 3 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు డిమాండ్ చేశారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీలపై ఇతరుల పెత్తనం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాయడమే తీర్పు సారాంశమన్నారు. ఇప్పటికైనా తీర్పును పున్ణసమీక్షించుకోవాలని కోరారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొమురం చందు, కనక హన్మంతరావు, రవి, సంతోష్‌లతో పాటు గ్రామస్తులున్నారు.
భీంపూర్ : జీవో నెంబర్ 3ని రద్దు చేయడం సరికాదని ఆదివాసీ విదార్థి సంఘాలు శుక్రవారం ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ రాజ్‌గడ్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘాలు, బౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ జీవో రద్దుతో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుందని వెంటనే ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు విలాస్, సంతోష్, వికాస్, రవి, జంగుబారు ఉన్నారు.
జీవో నెంబర్ 03 యథావిధిగా కొనసాగించాలి : ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం
జిల్లా అధ్యక్షుడు తలండి లక్ష్మణ్
కాగజ్‌నగర్ రూరల్ : సుప్రీంకోర్టు ఈ నెల 22న జీవో నెంబర్ 03పై ఇచ్చిన తీర్పుతో ఆదివాసుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, జీవో నెంబర్ 03ని యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు తలండి లక్ష్మణ్ అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు జీవో నెంబర్ 03 ప్రకారం జరగాలని, దీని ద్వారా ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో 50 శాతం మాత్రమే రిజర్వేషన్ పాటించాలనడం వారి అభివృద్ధికి తీవ్ర అన్యాయం చేసినట్టేనని తెలిపారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసి రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. జీవో నెంబర్ 03 యథావిధిగా కొనసాగించేలా చేయాలని లేదంటే అన్ని ఆదివాసీ సంఘాలను కలుపుకుని జీవో నెంబర్ 3 సాధనకు ఉద్యమం చేస్తామన్నారు.
Authorization