నవతెలంగాణ-ఆదిలాబాద్‌అర్బన్
స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించిన జీఓ నెం.3ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శించారు. టీఏజీఎస్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనూ నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన సందర్భంగా టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాఘవులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించకపోగా, ఆ జీఓపై కొంత మంది కుట్రదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆ జీఓని రద్దు చేసినందున వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెస్రం ఆనంద్, పవన్, కిరణ్ పాల్గొన్నారు .
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో..
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జీవో నెం.3 రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ
పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అమలు నిలుపుదల చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక ఆదివాసీ రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని, 5వ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీ రిజర్వేషన్‌పై బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే టీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...
సుప్రీం కోర్టు కొట్టేసిన జీఓ నెం.3ను యధావిధిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఆత్రం నగేష్ అన్నారు. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్‌లు పూర్తిగా అమలు చేయకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గిరిజనులను అభివద్ధికి దూరం చేయడమే అవుతుందని తెలిపారు. ఏజెన్సీలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ జీఓని కొట్టేయడం అంటే ఆదివాసుల అభివద్ధికి గొడ్డలిపెట్టులా మారుతుందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని, ట్రైబల్ అడ్వయిజరీ వెంటనే స్పందించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని, 5,6 షెడ్యూల్‌లను కాపాడాలని అన్నారు.
కాగజ్‌నగర్ : సుప్రీం కోర్టు రద్దు చేసిన జీఓ నెంబర్ 3పై పున:సమీక్ష జరిపి, సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు రివ్యూ పిటీషన్ వేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం టీఏజీఎస్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలకు ఉపాధ్యాయ పోస్టులలో కొంత ఉపశమనంగా ఉన్న జీఓ నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం గిరిజన చట్టాలను, ఐదో షెడ్యూలును అతిక్రమించడమే అవుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలలో స్థానిక గిరిజనులకే వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉమ్మడి గవర్నర్ ఆదేశాలతో జీఓ నెంబర్ 3 అమల్లోకి వచ్చిందనీ, ఇపుడు దానిని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఆదివాసీలకు అన్యాయం చేయడమేనని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలనీ, కేంద్ర కేబినెట్‌లో ఆర్డినెన్స్ తెచ్చి తీర్పుపై స్టే వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 3ని చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు సోషల్ మీడియాలో విస్తృతంగా నిరస తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ నాయకులు కొమురం చందు, కనక హన్మంత్‌రావు, రవి, సంతోష్ పాల్గొన్నారు
Authorization