- పిడుగుపాటుతో వ్యక్తి మృతి నవతెలంగాణ-ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వారం రోజులుగా ఎండలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాలివానతో కూడిన వర్షం రావడంతో పలుచోట్ల ఇండ్లపై కప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో వేములవాడ గంగమ్మ ఇల్లుపై రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో సామాగ్రి వర్షంలో తడిసి ముద్దయింది. పైకాజీనగర్, ఎల్‌ఐసీకాలనీతో పాటు పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి. ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి గ్రామానికి చెందిన పెద్దపెల్లి రాజయ్య(65) పిడుగుపాటుకు మృతి చెందాడు. వడగండ్లతో కూడిన వర్షం పడడంతో పిల్లలు చిందులు వేయడం కనిపించింది.