నవతెలంగాణ-నిర్మల్
నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్మల్ గ్రామీణ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ప్రోత్సహంతో దిలావర్‌పూర్ ఎస్‌ఐ సంజీవ్ సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి కూరగాయాలను జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు, సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు. పోలీసులు పౌష్టికాహారం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అధికమవుతుందని తెలిపారు. ఎండ తీవ్రతలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్‌స్ఫెక్టర్ వెంకటేశ్, నిర్మల్ పట్టణ, రూరల్, సోన్ సీఐలు జాన్‌దివాకర్, శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సోన్ గ్రామ మాజీ సర్పంచ్ క్రీర్తి శేషులు సాయాగౌడ్ జ్ఞాపకార్థం వారి మనుమలు శ్రీనివాస్‌గౌడ్, శరత్‌గౌడ్‌లు ఆదివారం గ్రామంలోని 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి హాజరై సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్, శరత్‌గౌడ్ చేస్తున్న సేవలను యువనేత అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు గంగాధర్, జగన్, ప్రసాద్, రాజేశ్వర్, కాంతయ్య పాల్గొన్నారు.
ఎర్రం పౌండేషన్, యువజన సంఘం ఆధ్వర్యంలో...
ఆదిలాబాద్ రూరల్ : ఎర్రం పౌండేషన్, యువజన సంఘం ఆధ్వర్యంలో వలస కార్మిక కుటుంబాలకు బియ్యం,కూరగాయలు పంపిణీ చేశారు. సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వలస కార్మిక కుటుంబాలను కూడా ఆదుకోవాలన్నారు. 20 కుటుంబాలకు తమ వంతు సాయం చేశామన్నారు. జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు ఎర్రం నర్సింగ రావు, సభ్యులు ఎర్రం దినేశ్, ప్రవీణ్, కన్నా ఉన్నారు.
మానవ సేవే.. మాధవ సేవ
తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్
తానూర్ : మానవ సేవే... మాధవ సేవా అని తానూర్ గ్రామ సర్పంచ్ తాడేవార్ విఠల్ అన్నారు. ఆదివారం తానూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్‌ఎంపీగా విధులు నిర్వహిస్తున్న కే.దత్త ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పాల్లొని మాట్లాడారు. లాక్‌డౌన్‌లో పేదలు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గుడిపెల్లి రాజన్న, మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఎంపీటీసీ పుండలీక్, ఉపసర్పంచ్ నయూమ్, పంచాయతీ కార్యదర్శి షఫీక్ పాల్గొన్నారు.
ఆదివాసీలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ఖానాపూర్ రూరల్ : మండలంలోని మారుమూల గ్రామాలైన కొలంగూడ, దేవునిగూడలో నివసిస్తున్న ఆదివాసీలకు ఖానాపూర్ పోలీసులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సి.శశిధర్ రాజు పాల్గొని మాట్లాడారు. రెండు గ్రామాల్లో కలిపి 80 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్టు తెలిపారు. కోవిడ్-19 నివారణకు ప్రజలంతా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వం సూచనలు పాటించాలన్నారు. సరుకుల వితరణకు సహకరించిన ఖానాపూర్ పట్టణానికి చెందిన చింతపండు రవిని ఆదర్శంగా తీసుకుని మరి కొందరు ముందుకు రావాలన్నారు. కష్టకాలంలో ఖానాపూర్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం హర్షణీయమన్నారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జయరాం, ఎస్‌ఐలు భవానీసేన్, రాజేశ్, పోలీసులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట : నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు, కార్మికులకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్థానిక విశ్రాంతి భవనంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మెన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మెన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు సుధాకర్, ఓరుగంటి శ్రీకాంత్, సురేశ్, చాతరాసి రాజన్న, మెట్టు కల్యాణి రాజు, షబానా సజ్జు, నాయకులు షాహిద్ అలీ, పాదం శ్రీనివాస్, సురేశ్, రాజన్న, వికాస్, తిరుపతి ఉన్నారు.
కాసిపేట : సోమగూడెంకు చెందిన కొంత మంది యువకులు కలిసి కాసిపేట మండలంలోని వెంకటాపూర్, రొట్టెపల్లి గ్రామ పంచాయతీలోని కుర్రేగఢ్, లక్ష్మీపూర్ గూడ, కొలాంగూడ, చిక్రం గూడ, కొత్తగూడ, చౌడుగూడ, భగవంత్ గూడ గిరిజన గ్రామాల్లో 100 కుటుంబాలకు కూరగాయలతో పాటు దాతల నుంచి బియ్యాన్ని సేకరించి గిరిజనులకు అందించి మానవత్వం చాటుకున్నారు. యువకులు మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి సహకరిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమన్నారు. సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యువకులు పాలకుర్తి కృష్ణ, సామల కిరణ్‌కుమార్, ఉప సర్పంచ్ ఆరెపల్లి ప్రవీణ్, గోలి మహేశ్, ప్రకాశ్‌గౌడ్, రక్షణ్, జైన సంతోష్, మహేష్ రాకేష్, యాసిన్, గాజుల అరుణ్, పేరాల మహేష్, గాజుల మహేష్‌తో పాటు కాసిపేట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కుర్సింగ అచ్యుతరావు, కొండబత్తుల తిరుపతి, వెంకటాపూర్ సర్పంచ్ ఆడె సౌందర్య శంకర్, రొట్టెపల్లి సర్పంచ్ పెంద్రం కవిత హన్మంతు పాల్గున్నారు.
వరుసగా ఐదు రోజులు అన్నదానం
బోథ్ : మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ శేక్‌రజియా బేగం హైదరాబాద్ నుంచి కాలినడకన మహారాష్ట్రకు వెళ్తున్న 25 మంది కూలీలకు పండ్లు, ఆహారం అందించారు. మొబైల్ సెంటర్‌కు చెందిన సంతోష్ వారి ఫోన్‌లకు ఉచితంగా రీఛార్జ్ వేయించారు. చందు వినాయక, అశోక్, ఇమ్రాన్, రమేశ్, సుకృత, రమ్య, సంతోష్ సహాయ సహకారాలందించారు.
నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలకు టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో 15 రకాల సరుకులు బియ్యం, పప్పు కూరగాయలను మండలంలోని జైనర్ పల్లి గ్రామంలో పంపిణీ చేశారు. టీయూటీఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీశ్‌కుమార్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. సోనాల గ్రామానికి చెందిన తుల సుభాశ్ వెల్ఫేర్ సొసైటీ, బోథ్ పట్టణానికి చెందిన మేదిచెల్మ కిషోర్ సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న 25 మంది వలస కూలీలకు పులిహోర, అరటిపండ్లు, జీడిపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సురేశ్, వైద్య శ్రీనివాస్‌రెడ్డి రఘుపతి మోహన్‌రెడ్డి ఉన్నారు.
వలస కూలీల చెంతకే ఆహారం
నర్సాపూర్(జి) : లాక్‌డౌన్ కారణంగా స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస కూలీలకు ఎన్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ నిర్మల్ సభ్యులు ఆసరగా నిలుస్తున్నారు. రెండ్రోజులుగా 43వ, 61వ జాతీయ రహదారిపై వెళ్తున్న కూలీలను గుర్తించి ద్విచక్ర వాహనంపై ఆహార ప్యాకెట్లు, మజ్జిగ, బిస్కెట్లు అందజేస్తున్నారు. సభ్యులు కార్తీక్, నర్సారెడ్డి, నాగరాజు, బ్రహ్మయ్య, మహేందర్ ఉన్నారు.
టీఎన్‌జీఓ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
నిర్మల్ : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమంలో భాగంగా కిషన్‌కుమార్, కిశోర్, కిషన్, ఆనంత్‌రావు రోజూ వలస కార్మికులకు, పేదలకు, అనాథలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. టీఎన్‌జీఓ అధ్యక్షులు వి.ప్రభాకర్ ఆధ్వర్యంలో రాకేశ్ (డిప్యూటీ తహసీల్దార్) కోశాధికారి, టీఎన్‌జీఓ సంఘం నిర్మల్ అర్బన్ యూనిట్, టి.ప్రవీణ్ (ఆర్‌ఐ) కార్యవర్గ సభ్యులు ఇరువురు 50 కిలోల చొప్పున క్వింటాల్ బియ్యాన్ని, వంట సామగ్రిని, ఆర్థికసాయాన్ని అందజేశారు. నిర్మల్ అర్బన్ యూనిట్ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సారెడ్డి, నాయకులు సుకుమార్, భీమన్న, పాల్గొన్నారు.
ఏరియాస్పత్రిలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ ప్యాకెట్ల దాతగా లావణ్య నరేంధర్ ఉపాధ్యాయులను నిర్మల్ సేవా సమితి సభ్యులు అభినందించారు. సభ్యులు సాదం ఆనంద్, యాటకారి సాయన్న, విశాల్‌సింగ్ పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా లక్ష్మి గణేష్ యూత్...
మందమర్రిరూరల్ : రోజు కూలీలకు నిరుపేదలకు, మేమున్నామంటూ లక్ష్మి గణేశ్ యూత్ సభ్యులు అండగా నిలిచారు. పట్టణంలోని రామన్‌కాలనీలోని 15 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. యూత్ కమిటి సభ్యులు సత్యంశెట్టి రాజేష్, మేకల కుమార్, బింగి శంకర్, వెల్ది సాయి, పెంచాల శ్రీనివాస్ ఉన్నారు.
ఆకలి తీరుస్తున్న అమ్మ ఆదర్శం యూత్
లాక్‌డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, నిరుపేదలకు పట్టణంలోని అమ్మ ఆదర్శం యూత్ సభ్యులు అండగా నిలిచి వారి ఆకలిని తీరుస్తున్నారు. పట్టణంలోని దీపక్‌నగర్, విద్యానగర్, మార్కెట్ ఏరియాకు చెందిన 6 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులందించారు. సంస్థ పట్టణాద్యక్షులు పెరుగు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మంతెన సుమన్, సభ్యులు సాతిని సంజీవ్, తూముల శ్రీనివాస్, రాకేష్, రమేష్ భవాని, కొల్లూరి శ్రీనివాస్, వేముల ప్రవీణ్, మందపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
నిరుపేదలకు అండగా నిలుస్తున్న సంజరు
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు బి.సంజరు కుమార్ నిరుపేదలకు అండగా నిలిచి బియ్యం, నిత్యావసర సరుకులు అందించి తన ఉదారతను చాటుకు న్నారు. యాపల్ ఏరియా రెండో వార్డుకు చెందిన నిరు పేదలు ఇంటికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సాయం చేశారు. టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఎండి.షరీఫా, జిల్లా నాయకులు వాసాల సాగర్, బోర్లకుంట శ్రీనివాస్, శ్రీకాంత్, బైరాజు శ్రీనివాస్ ఉన్నారు.
Authorization