నవతెలంగాణ - కాగజ్‌నగర్
లక్షెట్టిపేట మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు స్మారకార్థం ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రిలోని పేషెంట్లు, వారి బంధువులు, దినసరి కూలీలు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, డీసీసీ ఓబీసీ ఛైర్మన్ దాసరి వెంకటేష్, ఆసుపత్రి సిబ్బంది అంజన్న, సతీష్, డేవిడ్, నాయకులు రేహాన్, సత్తిబాబు, పత్తి మల్లేష్ పాల్గొన్నారు.
టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో..
తెలంగాణ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్ మండలం తుంగమడుగు గ్రామంలోని 30 మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శాంతికుమార్, ఉపాధ్యక్షులు భానుప్రకాష్, మండల అధ్యక్షులు జె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం కిరణ్, కార్యదర్శి వస్రం పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు....
సెవెన్ ఏరియా క్లబ్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఆదివారం నిత్యావసర వస్తువులను 29వ వార్డు కౌన్సిలర్ వెన్న సంగీత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిషోర్‌బాబు, టౌన్ ఎస్‌ఐ తమెసొద్దీన్, రిటైర్డ్ ఎస్‌ఐ శివప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బంగారు శ్రీనివాస్ పాల్గొన్నారు.
బియ్యం, కూరగాయలు పంపిణీ
తాండూర్: తాండూర్ గ్రామపంచాయతీ ద్వారకాపూర్ గ్రామంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇంటి వద్ద ఉంటున్న ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబాలకు సర్పంచ్ మాసాడి శారద-సత్తయ్య, బోయపల్లి ఎంపీటీసీ మాసాడి శ్రీదేవి-శ్రీరాములు, మాసాడి లచ్చన్న కలిసి నిత్యావసరాలు, మాస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పుర్ర శేఖర్, గ్రామ పెద్దలు ఉన్నారు. అలాగే మండలంలోని అబ్బాపూర్, చౌటపల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలకు జవాన్లు సాయం అందజేశారు. సీఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ బిశ్వజిత్ స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. అభినవ స్వచ్ఛందసేవా సంస్థ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వలస కూలీలు 150 మందికి భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభినవ స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షుడు అభినవ సంతోష్, విజరు, సత్యనారాయణ, రాజన్న, రమేష్, సాయి పాల్గొన్నారు.
Authorization