దహెగాం: మండలంలోని మర్రిపెల్లి గ్రామంలో ఆదివారం గుడుంబా స్థావరాలపై ఎస్‌ఐ రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.