నవతెలంగాణ-ముప్కాల్ పోలీసులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు రెంజర్ల, నల్లూర్ గ్రామాల్లో డ్రోన్ కేమెరాతో లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. వచ్చే నెల 7 వరకు మండల ప్రజలు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మినుగు రాజేశ్వర్, కానిస్టేబుళ్ళు నవనిత్, రాజ్ సాగర్, శ్రీకాంత్, గంగాధర్ పాల్గొన్నారు.