- సెర్ప్ మార్కెటింగ్ డీపీఎం సాయిలు నవతెలంగాణ-జక్రాన్‌పల్లి మహిళా సంఘ సభ్యులను ఉత్పత్తి రంగంలో భాగస్వాములు చేయాలని, సంఘ సభ్యుల అభివృద్ధికి రూ.30లక్ష సీఐఎఫ్ నిధులు మంజూరయ్యాయని మార్కెటింగ్ డీపీఎం సాయిలు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వీవోఏల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఎం మాట్లాడుతూ మాస్కులు, శానిటైజర్ల తయారీకి జిల్లాకు రూ.30 లక్షల నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఒక్కొక్క సభ్యులకు 20 నుంచి 30 వేల వరకు రుణాలు ఇప్పించి మాస్కులు కుట్టింటి వారికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో మాస్కులు తయారీ చేసే యూనిట్లు, శానిటైజర్ సెంటర్‌ను ఏర్పాటు చేయించాలన్నారు కార్యక్రమంలో ఏపీఎం రవీందర్ రెడ్డి, మండల సమైక్య ప్రతినిధులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసరాలు పంపిణీ ఐకెపి కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న ఎల్లయ్యకు, ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పని చేస్తున్నా బాబారుకి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన వస్తువులను అందజేశారు.