Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో ప్రతిఒక్కరూ ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలనేది నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన 'తలతిక్కరాజు కథలు' పుస్తకంలోని కథలు నేర్పేలా ఉన్నాయి. దీనిలో కథలు పిల్లలకు అర్థమయ్యేలా బొమ్మలతో పొందుపర్చారు.
స్నేహంలో కొంతమంది మనల్ని పొగడవచ్చు, కొంతమంది తిట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. అలాంటప్పుుడు మనల్ని ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడుతుంటే అది మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. మనల్ని బాగుచేయడం కోసం ఒక్కొక్కసారి అందరిముందు తిట్టినా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ కథలలో అసూయపడకూడదని, ప్రతికూలంగా ఆలోచించవద్దని, తొందర పడి ఒక నిర్ధారణకు రాకూడదని, వాస్తవాలను తెలుసుకోవాలని, ప్రతిఒక్కరికీ సాయం చేయాలని, మనమే గొప్పవాళ్ళమని అనుకోకూడదని, అపాయాన్ని ఉపాయంతో ఎలా ఎదుర్కోవాలో, పక్కవారికి అపకారం చేయకూడదని, నిజాలు చెప్పాలని, సమయాన్ని వృధా చేయకూడదని.. ఇలా ఎన్నో అంశాల గురించి ఈ పుస్తకంలో కథల రూపంలో రచయిత చక్కగా వివరించారు. ప్రతి కథలో నీతి జీవిత పాఠంగా ఉపయోగపడుతుంది.
వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రులు తప్పకుండా ఈ పుస్తకాన్ని పిల్లలతో చదివించాలి. ఇలాంటి బుక్స్ చదవడానికి తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలను ప్రోత్సహించాలి. సమాజాన్ని కొంతైనా అర్థంచేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా పిల్లలతో చదివించండి.
- ఎం. సంధ్య, నారాయణగూడ, హైదరాబాద్
తలతిక్కరాజు కథలు
నారంశెట్టి ఉమామహేశ్వరరావు
పేజీలు: 36, వెల: 40రూ||
ప్రతులకు: నవచేతన బుకహేౌస్,
ప్రజాశక్తి, నవతెలంగాణ అన్ని బ్రాంచీలలో