Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈ ఔత్సాహికవేత్త లకు మద్దతునివ్వడానికి స్మాల్ ఇండిస్టీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ)తో ఓ కీలక ఒప్పందం కుదర్చుకుంది.
తమ ఎంఎస్‌ఎంఈ ఖాతాదారుల రుణాల పునర్ వ్యవస్థీకరణను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ ఒప్పందం జరిగిందని బీఓబీ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈల కోసం మార్చి 2021 వరకు ఏకకాల రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అవకాశం కల్పించింది. ఆయా సంస్థల అప్పులు రూ.25 కోట్ల దిగువన ఉన్నవాటికి ఈ అవకాశం ఉంది. ఒక బ్యాంక్‌గా తాము డిజిటలైజేషన్, స్నేహపూర్వక ఖాతాదారుల ప్రక్రియలో భాగంగా సిడ్బితో భాగస్వామ్యం అయ్యామని బీఓబీ ఎంఎస్‌ఎంఈ అండ్ రిటైల్ బిజినెస్ సీజీఎం రామ్ జాస్స్ యాదవ్ తెలిపారు.