Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత రెండు, మూడేండ్లుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా సంక్షోభంతో ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో వాహన అమ్మకాలు పడిపోయాయి. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల కార్లు, ద్వి, త్రీ చక్ర, వాణిజ్య సహా అన్ని క్యాటగిరీల వాహనాల విక్రయాలు గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా కనిష్టానికి క్షీణించాయని వాహన పరిశ్రమ సంఘం సియోమ్ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. సియోమ్ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన తొమ్మిది మాసాల్లో కార్లు, ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలతో సహా ప్రయాణికుల వాహనాల విక్రయాలన్నీ కలుపుకుని 17.8 లక్షల యూనిట్లకే పరిమితం అయ్యాయి. ఇంతక్రితం 2010-11లో ప్రయాణికుల కార్ల విక్రయాలు 18.1 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కార్ల విక్రయాలను పెంచుకోవడానికి ఆటో పరిశ్రమ కష్టపడి పని చేస్తుందని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకవా పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ ప్రతిపాదనల్లో స్క్రాపేజీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నామన్నారు.