Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకంగా 42 రెట్లు సబ్‌స్రయిబ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని టెలికం మౌలిక వసతుల కంపెనీ రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రెయిల్‌టెల్) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు భారీ స్పందన వచ్చింది. మూడు రోజుల పాటు సాగిన ఇష్యూలో ఏకంగా 42.39 రెట్లు సబ్‌స్రయిబ్ అయ్యింది. ఈ ఐపిఒ ద్వారా రైల్‌టెల్‌లోని 27.16 శాతం వాటాకు సమానం అయ్యే 8.71 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. దీని ద్వారా రూ.819 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్‌టెల్ ఐపీఓ ధరల శ్రేణీని రూ.93-94గా నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) కంపెనీ అయినా రెయిల్‌టెల్ 2021జనవరి నాటికి 59,098 కిలోమీటర్ల పరిధిలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో పాటు 5,929 రైల్వే స్టేషన్లకు సేవలు అందిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్‌టెల్ రూ.1,128 కోట్ల రెవెన్యూతో రూ.140 కోట్ల లాభాలను సాధించింది.