Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్యంత విలక్షణమైన కాక్‌టెయిల్స్, గ్రిల్స్ మరియు తందూర్ ఈవెనింగ్స్‌కు హైదరాబాద్ లోని ఐబిస్ ఆతిథ్యం ఇస్తోంది. ఆహ్లాదకరమైన వారాంతపు సాయంత్రం, ఒక లైవ్ గ్రిల్ మధ్య చక్కని అలంకరణలతో కూడిన స్ప్రెడ్,ఇండోర్ మరియు అందమైన పరిసరాలు కలిగిన ఔట్‌డోర్ సీటింగ్‌తో, మీకు వెజ్ &నాన్-వెజ్ ప్లాటర్స్ మరియు వినూత్నమైన కాక్టెయిల్స్ లభిస్తాయి- ఒత్తిడితో కూడిన వారం అనంతరం చైతన్యాన్ని నింపుకునేందుకు ఇది అనువైన ప్రదేశంగా ఉండనుంది.
ప్రతి వారాంతంలో, చెఫ్ మరియు వారి నిపుణుల బృందం అత్యుత్తమ శ్రేణి గ్రిల్స్ మరియు తందూర్లను తయారు చేస్తుంది. విస్తృతమైన స్ప్రెడ్‌లో శాకాహారులు మరియు మాంసాహారులకు వేర్వేరుగా పన్నీర్ టిక్కా, వెజ్ శిఖాంపూరి కబాబ్ మరియు తందూర్‌లో ముర్గ్ మలాయ్ టిక్కా తదితరాలు ఉంటాయి. గ్రిల్స్‌లో వెజ్ శిఖాంపూరి కబాబ్, తందూరి ఫల్ధారి బగీచా తదితర ప్రత్యేకమైన రుచికరమైన వంటకాలు ఉంటాయి. కాంటినెంటల్ వంటకాలను ఇష్టపడేవారికి పెదవుల్ని చప్పరించుకునేంత రుచికరమైన అజ్వానీ ఫిష్ టిక్కా, అంగారా ముర్గ్ టిక్కా, కేసరి తంగాడి కబాబ్ తదితరాలు విస్తృత ఎంపికలు ఉంటాయి. నోరూరించే విస్తృతమైనస్ర్పెడ్‌లో ప్రతి ఒక్కరూ తమకు కావలసినవి ఎంపిక చేసుకునేందుకు అనువైనవి ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హోటల్ నిర్వాహకులు తమ అతిథులకు అత్యంత ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలతో, ఆహ్లాదకరమైన మరియు కచ్చితమైన వారాంతపు నైట్‌ఔట్లను అవుట్‌లను అందిస్తోంది.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఐబిస్
ఎప్పుడు: ప్రతి శుక్రవారం మరియు శనివారం
సమయం: రాత్రి 7 నుండి 11 వరకు
ధర:
· శాఖాహారం – అసార్టెడ్ ప్లాటర్ @ రూ.599 పన్నులతోకలిపి
· వెజ్&నాన్-వెజ్ - అసార్టెడ్ ప్లాటర్ @ రూ.799 పన్నులతోకలిపి
రిజర్వేషన్ల కోసం, సంప్రదించండి:040 – 30093006, +91 07337367627 Email: H6589-fb1@accor.com