Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 441 పాయింట్ల క్షీణత
ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. శుక్రవారం అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్ 441 పాయింట్లు లేదా 0.87 శాతం కోల్పోయి 50,405కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 726 పాయింట్లు కోల్పోయి 50,160 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. దీంతో వరుసగా రెండో రోజుల్లో 1000 పాయింట్ల పైన పడిపోయినట్లయ్యింది. వారాంతం రోజున ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 14,938 వద్ద ముగిసింది. అమ్మకాల దెబ్బకు అన్ని రంగాలూ నేల చూపులు చూశాయి. నిఫ్టీలో పిఎస్‌యు సూచీ అత్యధికంగా 4 శాతం కోల్పోగా.. లోహ సూచీ 3 శాతం, ఐటి, రియాల్టీ 2 శాతం చొప్పున, ఆటో, ఎఫ్‌ఎంసిజి రంగాలు 1.7 శాతం మేర విలువ కోల్పోయాయి. బిఎస్‌ఇలో 1,904 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా.. 1083 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్-30లో ఒఎన్‌జిసి, మారుతి సుజుకి, కొటాక్ బ్యాంక్, నెస్ట్లే ఇండియా సూచీలు 0.59 శాతం నుంచి 1.95 శాతం వరకు పెరిగిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఇండుస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐఎన్, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్ సూచీలు 4.79 శాతం వరకు పడిపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.