Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌లో కేంద్ర ప్రత్యేక్ష పన్ను నికర వసూళ్లలో 15.8శాతం వృద్ధితో రూ.3.86లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది (రూ.9.8 లక్షల కోట్ల) మొత్తం బడ్జెట్ అంచనాలలో ఇది 39.4శాతం. అలాగే స్థూల వసూళ్లు ( పన్ను తిరిగి చెల్లింపులు) 10.3శాతం వృద్ధితో రూ.4.66లక్షల కోట్లకు పెరిగింది. దీంట్లో పన్ను తిరిగి చెల్లింపులు రూ.79.660 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ 30 నాటికి ముందస్తు పన్ను చెల్లింపులు రూ.1.77లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. గతేడాదితో పోల్చి చూస్తే ముందస్తు పన్ను చెల్లింపుల్లో 11.5శాతం వృద్ధి సాధించింది. మరోవైపు ముందస్తు పన్ను.. కార్పొరేట్ ఆదాయ పన్ను (సీట్) 8.1శాతం, ముందస్తు పన్ను..వ్యక్తిగత ఆదాయ పన్ను (పీట్) 30.1శాతం చొప్పున పెరిగింది.