Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ఎఫ్‌జెడ్ సీరిస్‌లో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ పేరుతో ఆవిష్కరించింది. దీని ధర రూ.86,042 (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ బైకు మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్‌తో మంచి పనితీరు సామర్థ్యాన్ని కనబరుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 149 సీసీ, ఎయిర్‌కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, 220 ఎంఎం హైడ్రాలిక్ సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్, 282 ఎంఎం ఫ్రంట్ బ్రేక్‌లు బైక్‌ను సమర్థంగా నియంత్రిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా గత పదేండ్ల కాలంలో ఎఫ్‌జెడ్ సీరిస్ లక్షలాదిమంది కస్టమర్లను ఆకర్షించిందని, ఈ కొత్త బైక్ కూడా ఇదే ఒరవడిని కొనసాగించనుందని యమహా మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు, మార్కెటింగ్) రారు కురియన్ తెలిపారు.