Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాషింగ్ మిషన్ కేటగిరీ పోర్టు పోలియో బలోపేతం కోసం ఒనిడా ఈ విభాగంలో కొత్తగా 20 మోడళ్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో హీటర్లతో కలిగిన గ్లాస్ లిడ్ సెమీ ఆటోమెటెడ్, హైఎండ్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మిషన్లు ఉన్నట్లు మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఎండి విజరు మన్సుఖానీ తెలిపారు. ఈ కేటగిరీలో 60 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత ఏడాదిలో రూ.160 కోట్ల రెవెన్యూ సాధించాలని నిర్దేశించుకున్నామన్నారు. చిన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టామన్నారు. రూర్కీ దగ్గర తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడాదికి 7.20 లక్షల మిషన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 4,000 డీలర్లతో విస్తరించి ఉన్నామని, వచ్చే ఆరు నెలల్లో మరో 500 డీలర్లను జోడించుకోనున్నామన్నారు.