Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్ మళ్లీ దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్జ్ ఇండియా సంస్థ తాజాగా వెల్లడించిన 50 మేటి బ్రాండ్ల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాదాపు రూ.21.7 బిలియన్ డాలర్ల విలువతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా అయిదో సంవత్సరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలవడం విశేషం. ఇటీవలి కాలంలో బ్యాంక్ బ్రాండ్ విలువ 21 శాతం పెరగడం విశేషం. ప్రభుత్వ రంగ బీమీ సంస్థ ఎల్‌ఐటీ ఈ జాబితాలో 19.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 'బ్రాండ్జ్ ఇండియా' జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. దేశీయ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ సంస్థ దాదాపు 15 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో నిలిచినట్టుగా సంస్థ తెలిపింది.