Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణి జ్య విభాగం: జీఈ అప్లియెన్సెస్‌కు చెందిన ఫస్ట్‌బిల్డ్ విభాగం టి-వర్క్స్‌లో తన కేంద్రాన్ని నెలకొల్పోందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఆ సంస్థ మంగళవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో భారత్‌లోనే తొలిసారిగా జీఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రోతోటైప్ సెంటర్‌ను మార్కెట్‌ప్లేస్‌ను ఏర్పాటు చేసేందుకు వీలు పడనుందని సంస్థ తెలిపింది. హయర్ కంపెనీ మద్దతుతో గ్లోబల్ కో-క్రియేటింగ్ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై మంత్రులు కె.తారకరామారావు, జూపల్లిల సమక్షంలో ప్రభుత్వ ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.