Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్, అప్లియ న్సెస్ విక్రయ సంస్థ పై-ఇంటర్నేషనల్ వృద్ధి పథంలో దూసుకు పోతోంది. సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగా పై-ఇంటర్నేషనల్ తాజాగా హైదరాబాద్ నగరంలో మూడు కొత్త రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించింది. బేగంపేట్, మలక్‌పేట్, కొండాపూర్‌లలో సంస్థ తన కొత్త స్టోర్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో నగరంలో సంస్థ ప్రజల సౌకర్యార్థం 24 స్టోర్స్‌ను తెరిచినట్టయిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పై తెలిపారు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న మూడు మొబైల్ స్టోర్స్‌ను అత్యాధునిక హంగులతో వివిధ రకాల మోడల్స్ సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా రూపొందించినట్టుగా ఆయన వివరించారు. గడిచిన 18 సంవత్సరాల కాలంలో మొత్తం 140 స్టోర్స్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తమ సంస్థ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరించి ఉందని ఆయన అన్నారు. వినియోగదారుల నమ్మకమే బాసటగా తాము విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. 2019 నాటికి తమ స్టోర్స్ సంఖ్యను 250కి పెంచాలని తాము భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. కొత్త స్టోర్స్‌లో వినియోగదారులకు పలు ఇనాగరల్ ఆఫర్స్‌ను అందుబాటులో ఉంచినట్టుగా పై-ఇంటర్నేషనల్ యాజమాన్య వెల్లడించింది. తక్కువ ధర, ఎక్కువ మోడళ్లు, లోయాల్టీ పాయింట్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, సరసమైన ఫైనాన్స్ ఆఫ్షన్లను పై స్టోర్స్‌లో అందిస్తున్నట్టుగా సంస్థ తెలిపింది.