Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గురుగావ్ నుంచి తన ప్లాంట్‌ను తరలించాలని నిర్ణయించింది. కంపెనీకి చెందిన ఈ ప్లాంట్‌ను మారుతీ సుజుకీ దాదాపు 35 ఏండ్ల కిందట ప్రారంభించింది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతంగా ఉన్న ప్లాంట్ కేంద్రం ఇప్పుడు నగర విస్తరణతో పట్టణంలోకి కలిసిపోయింది. దీంతో నిత్యం స్థానికులతో పాటు కంపెనీ వర్గాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలను, ఇతర సమస్యలను అధిగమించేందుకు గాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టగా కంపెనీ చైర్మెన్ ఆర్.సి.భార్గవా తెలిపారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు ఏడాదికి ఏడు లక్షల కార్లు కావడం గమనార్హం. అయితే ఈ ప్లాంట్ తరలింపును ఉత్పిత్తి ప్రక్రియకు ఎలాంటి విఘతం కలుగకుండా.. తాము దశల వారీగా చేపట్టనున్నుట్టు ఆయన వివరించారు. ప్లాంట్ రిలోకేషన్ కారణంగా ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలుగకుండా తమ ఉద్యోగులు పలు ప్రణాళికలను రూపొందించినట్టుగా ఆయన తెలిపారు. గురుగావ్‌తో పాటుగా మారుతీ సుజుకీ సంస్థకు హర్యాణాలోని మానేసర్ వద్ద మరో ప్లాంటు ఉంది. దీని సామర్థ్యం ఏడాదికి ఎనిమిది లక్షల కార్లు. ప్లాంట్ రీలొకోషన్‌లో భాగంగా మారుతీ సుజుకీ సంస్థ గురుగావ్ నగరానికి దాదాపు 25 కి.మీ. దూరంలోని సోహ్నాలోని ఇండిస్టియల్ మోడల్ టౌన్‌షిప్‌లో దాదాపు1292 ఎకరాల స్థలాన్ని కోరిన సంగతి తెలిసిందే.