Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా రాకేశ్ శర్మ బుధవారం పగ్గాలు చేపట్టారు. ఆయన నియమకం వెంటనే అమలులోకి వచ్చింది. ఐడీబీఐకి కొత్త బాస్‌గా రాకేశ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం 5వ తేదీన ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. శర్మ ఐడీబీఐ బ్యాంక్ అధినేతగా ఆరు నెలల పాటు కొనసాగునున్నారు. అంతకు ముందు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా సేవలందించిన శర్మ ఈ ఏడాది జులై 31న పదవీ విరమణ పొందారు. కెనరా బ్యాంక్‌లో చేరక ముందు శర్మ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా కూడా పని చేశారు. శర్మ తన బ్యాంకింగ్ జీవితాన్ని మొదట స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి ప్రారంభించారు.