Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అందినకాడికి అప్పు చేస్తున్నారు! | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

అందినకాడికి అప్పు చేస్తున్నారు!

- యువత ఆర్థిక ప్లానింగ్‌లో వింత ధోరణి..
- రీపేమెంట్‌లపై జనుకు లేకుండా రుణాలు
- ఒక అప్పు తీర్చేందుకు.. మరో కొత్త రుణాలు
- బ్యాంకులు, విత్త సంస్థల్లో ఎగవేత భయాలు
- ఆర్థిక వ్యవస్థ కొత్త తలనొప్పిగా 'మిలేనియల్స్‌'!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ యువతలో వినూత్న ఆర్థిక ధోరణి కనిపిస్తోంది. తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం చాలా మంది యువత ముందూవెనుక చూసుకోకుండా విరివిగా అప్పులు తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులను పారదోలేందుకు బ్యాంకులు రవిరివిగా రుణాలు ఇస్తున్న నేపథ్యంలో.. యువత తమ అవసరాల కోసం విత్తసంస్థల నుంచి అందినకాడికి రుణాలను తీసుకుంటున్నారు. ట్రాన్స్‌యూనియన్‌-సిబిల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం యువత (1980 తరువాత జన్మించిన వారు) క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ లోన్‌లు, కన్జుమర్‌ డ్యురబుల్‌ లోన్స్‌ను తీసుకొనేందుకు అమితంగా ఆకస్తి చూపుతన్నట్టుగా తెలుస్తోంది. ఈ తరహా రుణాలు తీసుకొనేందుకు పెద్దగా జామీనులు అవసరం లేకపోవడంతో.. యువత తమ అవసరాలకంటే కూడా తమ విలాసాలకు ఎక్కువగా రుణాల బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రుణాలతో యువత కొత్తకొత్త మొబైల్స్‌, లాప్‌టాప్‌లు, ఫ్యాషన్‌ వస్త్రాల కొనుగోళ్లతో పాటు వివిధ రకాల పర్యటనలకు ఆసక్తి చూపుతున్నట్టుగా అధ్యయనంలో తేలింది. విశేషమేమిటంటే ఈ అప్పులు తీసుకొనేప్పుడు యువత తమ రీపేమంట్‌ అంశాన్ని పెద్దగా పట్టించకోవడం లేదని తెలుస్తోంది. భవిష్యత్తుపై అతి నమ్మకంతో వీరు రుణాల బాట పడుతున్నారని సమాచారం. తీరా పీకల మీదికి వస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రుణ భరాన్ని తగ్గించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో బ్యాంకులకు రానున్న రోజుల్లో ఈ రుణాలు సమస్యాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాంకులకు తలనొప్పిగా..
గడిచిన రెండేండ్ల నుంచి విత్త సంస్థల క్రెడిట్‌ డిమాండ్‌ను నిలబెడుతున్న వర్గాల్లో యువత ప్రధానంగా ముందు నిలుస్తూ వస్తోంది. బ్యాంకింగ్‌ సంస్థల గణాంకాలను పరిశీలించి చూస్తే 1980 తరువాత జన్మించిన వారు (నివేదిక వీరిని మిలేనియల్స్‌గా లెక్కగట్టింది) తీసుకొనే రుణాలలో 58% వృద్ధి నమోదవగా.. 1980కి ముందు జన్మించిన వారు తీసుకొనే రుణాలలో కేవలం 14 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోందని నివేదిక తెలిపింది. బ్యాంకుల నుంచి యువత ఎక్కువగా జామీను లేని (అన్‌సెక్యూర్డ్‌) రుణాలు తీసుకుంటున్నందున రానున్న రోజుల్లో బ్యాంకులకు ఈ విభాగం నుంచి పెద్ద అపద ఎదరయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. మొండి బాకీలు పెరిగిపోతున్న తరుణంలో విత్త సంస్థలు ఎక్కువగా రిటైల్‌ రుణాలపై దృష్టి సారిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ సిబిల్‌ రేటింగ్‌ కలిగిన వారికి కూడా రుణాలను అంటగడుతున్నారు. దీంతో యువత తమ అప్రాధాన్యమైన అవసరాల కోసం రుణాలు తీసుకొని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతానికి రిటైల్‌ రంగపు రుణాల నాణ్యత కార్పొరేట్‌ రుణాల కంటే మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి బ్యాంకులకు పెద్ద ఉపద్రవమే ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే ఇప్పటికే తీవ్ర గడ్డు పరిస్థితుల్లో మునిగి బ్యాంకులకు రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందుల రావడం తథ్యంగా కనిపిస్తోంది. మిలేనియల్స్‌ క్రెడిట్‌ అవసరాన్ని విశ్లేషించి చూస్తే క్రెడిట్‌ కార్డు, పర్సనల్‌ లోన్లు, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ లోన్స్‌ వాటా మొత్తం రుణాలలో 72 శాతంగా ఉంటోంది.
సిబిల్‌కు చిక్కకుండా జాగ్రత్తలు..
దేశ యువత విరివిగా అప్పులను తీసుకుంటన్నప్పటికీ తమ పరపతిని ప్రతిబింబించే సిబిల్‌ రేటింగ్‌ పడపోకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. చాలా మంది యువత అవసరం లేకున్నా అప్పులు చేసినప్పటికీ వాటి రీపేమెంట్‌ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలతో ఆయా రుణ కిస్తీలను కట్టేస్తున్నట్టుగా తేలింది. నిబంధన ప్రకారం కొత్త రుణాలను తీసుకోవాలంటే సిబిల్‌ రేటింగ్‌ సగటున 740 నుంచి 900 మధ్య ఉండాల్సి ఉంటుంది. దీనిని గమనించిన యువత ఒక విత్త సంస్థ దగ్గర తీసుకున్న రుణాలను తీర్చేందుకు ఇతర సంస్థల వద్ద కొత్త రుణాలను తీసుకొంటూ తమ రుణ పరపతి కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని నివేదిక తెలిపింది. అయితే కొందరు మాత్రం ఈ ప్రక్రియలో విఫలమై చేతులెత్తేస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్టుగా నివేదిక తెలిపింది. ఇది బ్యాంకులకు తలనొప్పిగా మారింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల బీమాతో ప్రత్యేక పథకాలు
ఊడిన లక్ష కొలువులు..!
ఐదేండ్ల కనిష్టానికి వినియోగదారుల విశ్వాసం..!
ట్రయాంఫ్‌ నుంచి రూ.18 లక్షల బైక్‌!
స్టాక్‌ మార్కెట్లకు 'వృద్ధి' భయాలు
వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తాం
వడ్డీ రేట్లు యథాతథం!
ధరలు పెరుగుతాయనే భయం వద్దు..
సంగారెడ్డి సమీపంలో అల్జెజా భారీ ప్లాంట్‌
నోకియా నుంచి మేటి 4కే టీవీ విడుదల
మధుమేహంతో కంటికీ ప్రమాదమే: మాక్స్‌విజన్‌
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!
బీఎస్‌6 ప్రమాణాలతో ఎక్స్‌యూవీ-300
చివరి గంటలో మార్కెట్లకు లాభాలు..
సీఎస్‌బీ ఐపీవో లిస్టింగ్‌ అదుర్స్‌!
దేశ ఆర్థిక వృద్ధికి సేవల రంగం ఊతం
విదేశాలలో భారీగా విస్తరిస్తాం: నెఫ్రోప్లస్‌
ప్రమాదంలో పౌర విమానయానం!
డిపాజిటర్లకు దక్కేది రూ.లక్షే!
సుంకాల భయంతో మార్కెట్లకు నష్టం!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు బేజారు!
జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
జియో సినిమాలో 'సన్‌నెక్ట్స్‌' సినిమాలు
దేశ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌: వాల్‌మార్ట్‌
అమెజాన్‌ గోబ్యాక్‌.. గోబ్యాక్‌!
జీతాలు పెరిగినా.. దక్కేది అంతంతే..!
కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ రద్దు: ఎన్‌ఎస్‌ఈ
మందగమనం తీవ్రతరమైంది: డీఅండ్‌బీ
వృద్ధిరేటుకు భారీ కోత: క్రిసిల్‌
త్వరలో మార్కెట్లోకి టాటా నెక్సన్‌ ఎలక్ట్రిక్‌

తాజా వార్తలు

07:36 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

07:31 AM

జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభం

07:23 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

07:12 AM

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

07:03 AM

రేపు దేశవ్యాప్తంగా సీటెట్‌

06:54 AM

బార్‌ లైసెన్సు దరఖాస్తు గడువు పెంపు

06:53 AM

15ఏళ్ల బాలికపై లైంగికదాడి

06:46 AM

మహిళను వేధిస్తున్న పూజారి అరెస్టు

06:43 AM

విశాఖలో వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభం

06:38 AM

63 వేల మారుతి కార్ల రీకాల్

06:33 AM

నేడు నగరానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

06:20 AM

నేడు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ బంద్‌

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.