Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమ్మకానికి ఐఓసీ! | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 15,2019

అమ్మకానికి ఐఓసీ!

- ద్రవ్యలోటు పూడ్చుకొనేందుకు సర్కారు కొత్త ఆలోచన
- 26% కీలక వాటాను ప్రయివేటుకిచ్చేందుకు ప్లాన్‌..!
- వచ్చే వారం క్యాబినెట్‌ ముందుకు విక్రయ ప్రతిపాదన
- రిఫైనరీ, ఇంధన రిటైలింగ్‌పై భారీ ప్రభావానికి ఛాన్స్‌
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:
దేశంలో పన్ను ఆదాయం పడిపోతూ.. సర్కారు ద్రవ్యలోటు అంతకంతకు పెరిగిపోతున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఆపసోపాలు పడుతోంది. పెరుగుతున్న ద్రవ్యలోటును నియంత్రించేందుకు గాను సర్కారు పాడి ఆవుల్లాంటి ప్రభుత్వ సంస్థల్లో తనకున్న కీలక వాటాను ప్రయివేటుకు విక్రయించాలని భావిస్తోంది. ఈ ఎత్తుగడతో ప్రయివేటు రంగంలో ఉన్న తమ అస్మదీయులకు మేలు చేయడంతో పాటుగా.. ద్రవ్యలోటును నియంత్రించవచ్చన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు సర్కారు దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్‌ సంస్థ అయిన ''ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌''లో (ఐఓసీ) కీలక వాటాను విక్రయించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఐఓసీలో ప్రస్తుతం భారత ప్రభుత్వం నేరుగా 51.5 శాతం నియంత్రిత వాటాను కలిగి ఉంది. మరో 25.9% వాటా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ చేతుల్లోనూ.. మిగతా వాటా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ మరియు ఆయిల్‌ ఇండియా సంస్థల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో తన వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
అతిపెద్ద ఆయిల్‌ కంపెనీకే ఎసరు..!
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ తన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ యూనిట్‌తో కలిసి దేశ వ్యాప్తంగా 11 రిఫైనరీలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశంలోని మొత్తం ముడిచమురు శుద్ధికరణ సామర్థ్యంలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉంది. రిఫైనరీతో పాటు దేశంలోని మొత్తం రిఫిల్లింగ్‌ స్టేషన్లలో దాదాపు సగం బంకులు ఐఓసీ గొడుగు కిందే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థలను అమ్మితే మార్కెట్ల నుంచి అంతగా స్పందన రాదని భావిస్తున్న సర్కారు.. పాడి ఆవులాంటి ఐఓసీలో వాటాను విక్రయానికి ఉంచితే మేటి స్పందన లభించి అనుకున్న సొమ్ము చేతుకొస్తుందని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదే ఆలోచనతో సర్కారు ఈ సంస్థలో వాటా విక్రయానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఐఓసీలో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనల తయారీ ఇప్పటికే పూర్తయినట్టుగా సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలోని ఐఓసీలో కీలక వాటా విక్రయానికి సంబంధించి సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సర్కారు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఐవోసీలో సర్కారు దాదాపు 26.4 శాతం వాటాను విక్రయించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విక్రయం ద్వారా దాదాపు రూ.33,000 కోట్ల మేర నిధులను సమీకరించవచ్చన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఐఓసీలో కీలక వాటాను ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ మార్గంలో జనవరిలోగా విక్రయించాలన్నది సర్కారు ప్రణాళికగా సమాచారం. ఈ వాటా విక్రయించినప్పటికీ సంస్థలో కీలక వాటా వివిధ రూపాల్లో సర్కారు చేతుల్లోనే ఉండనుందని సర్కారులోని ఆధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తూ ఐఓసీలో వాటాను విక్రయించాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ, రిటైలింగ్‌ సంస్థ అయిన ఐఓసీలో వాటా విక్రయం వల్ల రానున్న రోజుల్లో దేశ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరువు నిలుపుకొనేందుకే అమ్మకం..
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న వివిధ అనాలోచిత నిర్ణయాల ఫలితంగా ఖజానాకు పన్ను ఆదాయం అంతకంతకు పడిపోతూ వస్తోంది. దీంతో ద్రవ్యలోటు పెరిగిపోయి సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు తన పరువు నిలుపుకొనేందుకే మేటి సంస్థల్లో వాటా విక్రయం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్‌లో సర్కారు ద్రవ్యలోటు గరిష్టావధిని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించుకుంది. అయితే సర్కారు తన ఖర్చును తగ్గించుకొనే దిశగా చర్యలు తీసుకోకపోవడం, మందగమనం కారణంగా ద్రవ్యలోటు దాదాపు అంచనా వేసిన స్థాయికి చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఐదు నెలల కాలం మిగిలి ఉంది. ఈనేపథ్యంలో లోటు మరింతగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సర్కారు తన వ్యయాలకు అవసరమైన నిధుల కోసం ద్రవ్యలోటను తగ్గించుకొనేందుకు గాను కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థల్లో డిజిన్వెష్ట్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ.1.05 లక్షల కోట్ల మేర నిధులను సమీకరించాలని మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ లక్ష్యాన్ని అందుకొనేందుకు గాను లాభాల్లో ఉన్న ఆకర్షణీయమైన ప్రభుత్వ కంపెనీల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు గాను సర్కారు ఇండియన్‌ ఆయిల్‌తో పాటు ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, గెయిల్‌ ఇండియా వంటి సంస్థలను ఎంపిక చేసి పెట్టుకుంది. వాటా విక్రయ ప్రక్రియలో భాగంగానే భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి కూడా వచ్చే వారం జరగనున్న క్యాబినెట్‌ సమావేశంలో సర్కారు ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రూ.1,668 కోట్ల విదేశీపెట్టుబడుల ఉపసంహరణ
నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు
గృహా కొనుగోళ్లలో 74 శాతం వృద్ధి : హోమ్‌లేన్‌
కేంద్రానికి తలనొప్పిగా జీఎస్టీ
పరిశీలనతో ఆదాయం పన్ను తగ్గింపు..
రెండు రంగాలలో తీవ్ర సంక్షోభం!
ఉద్యోగుల బీమాతో ప్రత్యేక పథకాలు
ఊడిన లక్ష కొలువులు..!
ఐదేండ్ల కనిష్టానికి వినియోగదారుల విశ్వాసం..!
ట్రయాంఫ్‌ నుంచి రూ.18 లక్షల బైక్‌!
స్టాక్‌ మార్కెట్లకు 'వృద్ధి' భయాలు
వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తాం
వడ్డీ రేట్లు యథాతథం!
ధరలు పెరుగుతాయనే భయం వద్దు..
సంగారెడ్డి సమీపంలో అల్జెజా భారీ ప్లాంట్‌
నోకియా నుంచి మేటి 4కే టీవీ విడుదల
మధుమేహంతో కంటికీ ప్రమాదమే: మాక్స్‌విజన్‌
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!
బీఎస్‌6 ప్రమాణాలతో ఎక్స్‌యూవీ-300
చివరి గంటలో మార్కెట్లకు లాభాలు..
సీఎస్‌బీ ఐపీవో లిస్టింగ్‌ అదుర్స్‌!
దేశ ఆర్థిక వృద్ధికి సేవల రంగం ఊతం
విదేశాలలో భారీగా విస్తరిస్తాం: నెఫ్రోప్లస్‌
ప్రమాదంలో పౌర విమానయానం!
డిపాజిటర్లకు దక్కేది రూ.లక్షే!
సుంకాల భయంతో మార్కెట్లకు నష్టం!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు బేజారు!
జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
జియో సినిమాలో 'సన్‌నెక్ట్స్‌' సినిమాలు
దేశ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌: వాల్‌మార్ట్‌

తాజా వార్తలు

03:54 PM

గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి

03:51 PM

భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్‌

03:48 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:45 PM

ఐఏఎస్ ఆఫీసర్ జీవిత నేపథ్యంలో సినిమా

03:43 PM

వర్షాల వల్ల ఉల్లి పంట నాశనం అయింది: ఏపీ మంత్రి మోపిదేవి

03:41 PM

ఇంటి వాడైన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్..

03:40 PM

కేంద్ర మంత్రుల గైర్హాజరుపై ఉప రాష్ట్రపతి ఆగ్రహం

03:38 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

03:35 PM

జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల ధర్నా

03:34 PM

మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా అమ్మాయి

03:34 PM

నూర్ అహ్మద్ కుటుంబానికి విరాళం ప్రకటించిన రామ్ చరణ్

03:27 PM

భూములు కోల్పోయిన వారికి పరిహారం : రాహుల్ గాంధీ

03:26 PM

పత్తి ధరలను తగ్గించి దళారీలు కొనుగోలు చేస్తున్నారు : తమ్మినేని

03:22 PM

ఇళ్ల దగ్గరికే కిలో రూ.25 చొప్పున ఎందుకు సరఫరా చేయట్లేదు: పవన్

03:16 PM

విదేశాలకు వెళ్లేందుకు రాబర్ట్ వాద్రాకు కోర్టు అనుమతి

03:09 PM

34 ఏళ్ల‌కే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు

03:06 PM

యాంకర్ రవి కారుకు ప్రమాదం..

02:57 PM

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఈనెల 12కు వాయిదా

02:51 PM

డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

02:38 PM

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు 'చంపేస్తాడు' వీడియో సాంగ్‌

02:32 PM

దిశ హత్యకు కారణం విచ్చలవిడి మద్యం అమ్మకాలే : రజని

02:26 PM

మహిళల భద్రతపై చర్చిస్తోంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ పడుతోంది

02:22 PM

విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

02:18 PM

హెరిటేజ్‌ ప్రెష్‌కు,హెరిటేజ్‌ ఫుడ్స్‌కు తేడా తెలియదా?: చంద్రబాబు

02:10 PM

నిహారిక, చిన్నారుల ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

02:05 PM

బీఎస్‌-6 యమహా కొత్త బైక్‌ లాంచ్‌..

01:58 PM

ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలకు ఇబ్బందులు: రమణ

01:58 PM

మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు : వృద్ద దంపతులు

01:57 PM

హిట్లర్‌గా మారిన అమిత్‌ షా : ఓవైసీ

01:50 PM

మెట్రో స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.