Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో దక్షిణాది సినీ ప్రేమికులను అలరించేందుకు వినూత్న విధానంలో సిద్ధమైంది. ఇకపై రిలయన్స్ జియో సంస్థ సన్ టీవీ నెట్‌వర్క్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సన్ నెక్ట్స్‌ను దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. సన్ నెక్ట్స్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది. తద్వారా జియో యూజర్లకు సన్ నెక్ట్స్ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. కాగా జియో సినిమా యాప్‌లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా లక్షకు పైగా టీవీ షో ఎపిసోడ్ల కంటెంట్‌ను కలిగి ఉంది. కాగా దక్షిణ భారత స్టూడియోల నుంచి అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలకు సన్ నెక్ట్స్ పేరు గాంచింది. ఈ వేదికపై పలు మేటి చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థల భాగాస్వామ్యంతో జియో వాడకందారులకు మేలు జరుగనుంది.