Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 41% ప్రీమియంతో లిస్టింగ్
ముంబయి: కేథలిక్ సిరియన్ బ్యాంక్(సీఎస్‌బీ) స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో లిస్ట్ అయింది. సీఎస్‌బీ షేరు బుధవారం 41శాతం ప్రీమియంతో రూ.275 వద్ద లిస్టైంది. సీఎస్‌బీ స్టాక్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐపీవో జారీ ధరకంటే దాదాపు 57 శాతం పెరిగి రూ.307 స్థాయిని తాకింది. పబ్లిక్ ఇష్యూలో ఈ సంస్థ షేరు ఇష్యూ ధర రూ.195గా నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎస్‌బీ ఐపీవో నవంబర్ 22న ప్రారంభమై 28న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీవోపై ఆది నుంచి అమితాసక్తి కనబరిచిన మదుపరులు అత్యధికంగా బిడ్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పబ్లిక్ ఇష్యూ దాదాపు 87 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. అంటే 1.15కోట్ల షేర్లను ఐపీవోకు సిద్ధం చేస్తే 100 కోట్ల షేర్లకు డిమాండ్ వచ్చిందన్నమాట. రూ.193- రూ.195 ప్రైస్‌బ్యాండ్‌తో ఐపీవోకు వచ్చిన ఈ బ్యాంక్ రూ.410 కోట్ల వరకు సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బ్యాంక్ మరో కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఎండీ, సీఈవోగా సీవీఆర్ రాజేంద్రన్‌ను మరోసారి నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ నియామకం డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.