Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోని మధుమేహం (షుగర్) రోగులలో కంటి సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్నాయని ప్రముఖ కంటి ఆసుపత్రి మాక్స్‌విజన్ వ్యవస్థాపకులు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇటీవలి కాలంలో కంటి చూపు పోగొట్టుకుంటన్న వారిని పరిశీలిస్తే అందుకు మధుమేహమే ప్రధాన కారణంగా నిలుస్తూ వస్తోందని ఆయన అన్నారు. మధుమేహంతో బాధపడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు ''డయాబెటిక్ రిటినోథెరఫీ'' సమస్య, కంటి చూపు పోగొట్టుకోవడం వంటి వాటితో బాధపడుతున్నారని ఆయన అన్నారు. కంటి రెటీనా వ్యాధులతో బాధపడుతున్న వారి సౌలభ్యం కోసం మ్యాక్స్ విజన్ కేంద్రాలలో అత్యాధునికమైన అల్‌కెన్ టెక్నాలజీతో కూడిన చికిత్సను తెలుగు రాష్ట్రాలలో అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీ కారణంగా అన్ని రకాల రెటీనా శస్త్రచికిత్సలు అతి తక్కువ సమయంలో నొప్పిలేకుండా అత్యధిక సక్సెస్ రేటుతో నిర్వహించేందుకు వీలు పడుతుందనిఅన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని మొత్తం ఐదు మ్యాక్స్ విజన్ కేంద్రాలలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఇందులో హైదరాబాద్‌లోనే రెండు కేంద్రాలు ఉన్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ రెటీనా సేవల విభాగం అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్‌రావు, సంస్థ సీవోవో సుధీర్‌లు పాల్గొన్నారు.