Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి తన మొదటి స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్, స్టయిలిష్ లుక్, స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన ఆడియో వీటి ప్రత్యేకం. 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ ధరను కంపెనీ రూ.41,999గా నిర్ణయించింది. 55 అంగుళాల అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్, సీఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ సామర్థ్యం, వైఫై యాక్సెస్, 3 హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులతో ఈ టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఇతర గూగుల్ సూట్ యాప్స్‌ను కూడా ఈ నోకియా టీవీ సపోర్ట్ చేస్తుందని సంస్థ పేర్కొంది. తొలిసారిగా జేబీఎల్‌తో తాము జత కలిసినట్టు నోకియా తెలిపింది.