Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ట్రయాంఫ్ మోటార్ సైకిల్స్ సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. రాకెట్ 3 మోడల్‌ను సంస్థ శుక్రవారం భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ధరను కంపెనీ రూ.18 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ బైక్స్‌లో ఆర్, జీటీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లోకి ఆర్ వేరియంట్‌ను విడుదల చేశారు. దీనిలో శక్తివంతమైన ఇంజిన్, తక్కువ బరువు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను అమర్చారు. ఈ సరికొత్త బైకులో 3 సిలిండర్ 2,500 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6000 ఆర్‌పీఎం వద్ద 165 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 4000 ఆర్‌పీఎం వద్ద అత్యధికంగా 221 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ బైకులో రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, హిల్‌హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రౌండ్‌గా ఉన్న హెడ్‌లైట్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, అల్యూమినియం ఫ్రేమ్‌ను వాడామని సంస్థ తెలిపింది.