Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఊడిన లక్ష కొలువులు..! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

ఊడిన లక్ష కొలువులు..!

- వాహన విడిభాగాల పరిశ్రమకు తీవ్ర గడ్డుకాలం
- గతంలో ఎన్నడూలేని విధంగా తగ్గిన టర్నోవర్‌
- గణనీయంగా పడిన సామర్థ్యపు వినియోగం..!
- ప్రభావం చూపుతున్న తీవ్ర అనిశ్చిత పరిస్థితులు
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా దేశంలోని వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. డిమాండ్‌ పడిపోయి విక్రయాలు తగ్గిపోవడంతో ఈ పరిశ్రమల వారికి ఆర్డర్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమల టర్నోవర్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతింది. దీంతో ఈ రంగంలో దాదాపు లక్ష మంది తాత్కాలిక ఉద్యోగులు కొలువులు కోల్పోయినట్టుగా పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ మొత్తం టర్నోవర్‌ ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో 10.1 శాతం కుంగి రూ.1.99 లక్షల కోట్ల నుంచి రూ.1.79 లక్షల కోట్లకు పడిపోయిందని ''వాహనాల విడిభాగాల తయారీ అసోసియేషన్‌'' (ఏసీఎంఏ) తెలిపింది. దీనికి తోడు మందగమనం కారణంగా పరిశ్రల దాదాపు రెండు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులను కూడా కోల్పోయినట్టుగా ఏసీఎంఏ వివరించింది. అయితే కాస్త ఊరట కలిగించే అంశమేమిటంటే వాహన విడిభాగాల పరిశ్రల ఎగుమతుల్లో 2.7 శాతం వృద్ధి కనిపించినట్టుగా ఏసీఎంఏ తెలిపింది. అయినా ఈ వృద్ధి ఉద్యోగ తీసివేతలను నిలవరించలేకపోయిందని ఏసీఎంఏ వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ సెప్టెంబరు మధ్య కాలంలో వాహనాల విడిభాగాల దిగుమతులు 6.7 శాతం మేర తగ్గి రూ.57,674 కోట్లుగా నమోదయ్యాయని ఏసీఎంఏ వివరించింది. మందగమన పరిస్థితుల నేపథ్యంలో వాహనాల విడిభాగాల తయారీ సంస్థల సామర్థ్య వినియోగం 80 శాతం గరిష్టం నుంచి 50 శాతానికి పడిపోయిందని ఏసీఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆటోమొబైల్‌లో అంతా అనిశ్చితే..
వాహనాల కొనుగోళ్లలో స్తబ్ధత, బీఎస్‌ ప్రమాణాల మార్పునకు అనుగుణంగా విడిభాగాల తయారీకి కావాల్సిన మెషినరీ నిమిత్తం భారీగా పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ నగదు కొరత, విద్యుత్‌ వాహనాలకు సంబంధించి సర్కారు ప్రకటించిన విధానంలో స్పష్టత లోపించడం వంటి అంశాలు వాహన విడిభాగా పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ప్రమాణాల విడిభాగాల తయారీకి మారేందుకు గాను వాహన పరిశ్రమ దాదాపు రూ.80,000 నుంచి రూ.90,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీఎంఏ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో విడిభాగాల తయారీ పరిశ్రమ వాటా రూ.30,000 కోట్ల నుంచి రూ.35000 కోట్ల వరకు ఉన్నట్టుగా ఏసీఎంఏ లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన జీఎస్టీ పన్ను విధానం కూడా పరిశ్రపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తోంది. దీంతో వాహన విడిభాగాల తయారీ పరిశ్రలు ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వాహన విడిభాగాల తయారు చేసే వారు అత్యధికంగా ఎంఎస్‌ఎంఈ విభాగంలోని వారే కావడంతో కొలువులు కోల్పోయిన వారు కూడా అత్యధికం పేద, మధ్య తరగతి వారేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దీర్ఘకాలిక మందగమనంతో ఇబ్బంది..
దేశంలోని వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ దీర్ఘకాలికంగా మందగమన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్‌ జైన్‌ తెలిపారు. అన్ని విభాగాల వాహన విక్రయాలలో గత ఏడాది కాలంలో కొనుగోళ్లు పడిపోతూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం వాహన విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలపై తీవ్రంగా ప్రతిబింబిస్తూ వస్తోందని దీపక్‌ జైన్‌ వివరించారు. వాహన విడిభాగాల తయారీ పరిశ్రమ ఎక్కువగా.. ఆటోమొబైల్‌ సంస్థల ఉత్పత్తిపైనే ఆధారపడుతూ వస్తుందని ఆయన అన్నారు. ఇటీవల ఆటో పరిశ్రమలు వాహనాల ఉత్పత్తిని 15-20 శాతం మేర తగ్గించుకుంటుండడంతో విడిభాగాల తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని ఆయన వివరించారు. 2013-14 మధ్య కాలంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమల టర్నోవర్‌ తగ్గడం కనిపించిందని ఆయన అన్నారు. ఆ తరువాత మళ్లీ పరిశ్రమల అలాంటి గడ్డుకాలాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని జైన్‌ వివరించారు. గడ్డు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అక్టోబరు నుంచి జులై మధ్య కాలంలో సంస్థలు భారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం జరిగిందని ఆయన అన్నారు. ఆయా పరిశ్రమల వారు తమ డిమాండ్‌ మేరకు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగాలు కొండెక్కాయని ఆయన అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చెన్నైలో ఆటోమొబైల్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ తయారీ పరిశ్రమ
మిడ్-సైజ్ సిడాన్ విభాగం సేల్స్ కి దారితీసిన హోండా సిటీ
కొత్త సంవత్సరపు అదృష్టాన్ని తీసుకువచ్చే కొత్త కథ ‘గుల్లాక్’
PhonePeతో పన్ను ఆదా
బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే

తాజా వార్తలు

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

07:52 PM

కత్తితో పోడిచి సారీ చెప్పి, 1000 ఇచ్చారు..

07:24 PM

ఇద్దరు మహిళా జడ్జీలను కాల్చి చంపాడు..

07:18 PM

23న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

06:51 PM

రెండు బైక్‎లు ఢీ..ఒకరు మృతి

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

06:20 PM

జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య.. అధికార పక్షం బాధ్యత వహించాలి

06:08 PM

భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేస్తున్న స్పిన్ బౌలర్..

05:57 PM

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

05:55 PM

కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు సిద్ధం : పొన్నాల

05:47 PM

మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ..

05:45 PM

వైన్ షాపులో భారీ చోరీ..లాకర్ ఓపెన్ చేసి

05:38 PM

వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

05:21 PM

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు..

05:20 PM

బైక్‌ను అడ్డుకున్న పోలీసును దారుణంగా కొట్టిన యువకులు..

05:12 PM

సిరిసిల్లలో యువకుడిని దారుణంగా కొట్టిన హిజ్రా..

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.