Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం వేగంగా విస్తరిస్తోందని హోమ్‌లేన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ అయ్యర్ అన్నారు. 2019 తొలి మూడు త్రైమాసిక కాలంలో నగరంలో గృహాల కొనుగోలులో 74 శాతం వృద్ధి నమోదు అయిందని ఆయన అన్నారు. ఈ కారణంగానే తమ సంస్థ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారిస్తోందని ఆయన వివరించారు. హోమ్‌లేన్ సంస్థ నగరంలో ఏర్పాటు చేసిన మూడో ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ సీబీవో, బోర్డు సభ్యుడు తనూజ్ చౌదరీ తమ సేవలను ఇప్పటి వరకు 6000 ప్రాజెక్టులకు విస్తరించినట్టుగా తెలిపారు. 750కి పైగా డిజైన్ ఎక్స్‌పర్ట్స్ తమ సంస్థలో పని చేస్తున్నారని ఆయన అన్నారు.