Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ మౌలిక వసతుల రంగం పరిస్థితికి అద్దం పట్టే స్టీల్ డిమాండ్ ప్రతికూలతను ఎదుర్కొంటుంది. మాంద్యం దెబ్బకు ఈ లోహం అమ్మకాలను ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రస్తుత త్రైమాసికం తొలి రెండు నెలల్లో (అక్టోబర్-నవంబర్) స్టీల్ డిమాండ్ 1.8 శాతం క్షీణించి 15.4 మిలియన్ టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే మాసాల్లో 15.7 మిలియన్ టన్నుల అమ్మకాలు జరిగాయి. దేశంలో నెలకొన్న బలహీన డిమాండ్, నవంబర్‌లో పెరిగిన ధరలు దేశీయ స్టీల్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీలు విశ్లేషిస్తున్నాయి. జీడీపీ వృద్ధి రేటుతోనూ పోల్చినా స్టీల్ డిమాండ్ అత్యంత పేలవంగా నమోదవుతోందని పేర్కొంది.