Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020కి 45,500 స్థాయికి బీఎస్‌ఈసెన్సెక్స్: కోటక్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో వ్యవస్థీకృత మందగమన పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం అధినేత రస్‌మిక్ ఓజా అన్నారు. ఈ పరిస్థితులు మరో రెండు మూడు త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందగమనంలోనూ ఈ ఏడాది మార్కెట్లు భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితుల కారణంగా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నాయని.. దీని ఫలితంగానే విదేశాల నుంచి వెల్లువలా స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయని ఆయన అన్నారు. ఈ కారణంగానే భారత్‌తో పాటు వర్ధమాన దేశాలలో విదేశీ పెట్టుబడుల రాక పెరిగిపోతున్నట్టుగా ఆయన వివరించారు. విదేశీ పెట్టుబడులు పటిష్టంగా ఉండడం, అలాగే దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి సిప్(సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్‌మెంట్ వంటివి పెరగడమే అని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మంచి లాభాలను తీసువస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయని, అంతటా ప్రస్తుతం ఈక్విటీలు మంచి రాబడిని ఇచ్చే సాధనాలుగా మారాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2020లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 45,500 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13,500 పాయింట్ల స్థాయిని చేరగలవని తమ విశ్లేషణలు చెబుతున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మార్కెట్లు మరింతగా పైకి ఎగిసే అవకాశం ఉన్నట్టుగా కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషించింది.