Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్యాక్టరీ విస్తరణకు 700 కోట్ల వ్యయం
- 5000 మందికి ఉద్యోగó అవకాశాలు
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పుత్తుల తయారీ సంస్థ స్కైవర్త్ భారత్‌లో వేగంగా విస్తరిం చాలని నిర్ణయించింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైవర్త్ హైదరాబాద్‌లో తమ ఫ్యాక్టరీని మరింత విస్తరించాలని భావిస్తున్న ట్టుగా ఆ సంస్థ భారత విభాగం ఎండీ క్రయివర్ లియు తెలిపారు. ఇందుకు గాను రానున్న రోజుల్లో దాదాపు రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆయన వివ రించారు. ప్రపంచంలో అతిపెద్ద టీవీ తయారీ సంస్థల్లో ఒకటైన స్కైవర్స్ సంస్థ మెట్జ్, కూకా బ్రాండ్‌తో సొంతగా టీ వీలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత ప్రజలకు మెరుగైన ఉత్పత్తులను అందించడంతో పాటు అమ్మకం తరువాత కూడా మెరుగైన సేవలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రంలో పెట్టుబడుల కారణంగా తెలంగాణలో దాదాపు 5000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన వివరించారు. స్కైవర్త్ సంస్థ టీవీలతో పాటుగా డిస్ల్పే డివైజెస్, డిజటల్ సెట్‌టాప్ బ్యాక్సులు, సెక్యూరిటీ మోనిటర్‌లు, నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్‌లు, సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 19.6 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ప్రఖ్యాతి చెందిన స్కైవర్త్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లోనిఫ్యాక్టరీలో దాదాపు 15 మిలియన్ డాలర్లను వెచ్చించనుందని సంస్థ తెలంగాణ శాఖ మార్కెటింగ్ విభాగం హెడ్ ఫియో తెలపారు. ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగేలా తాము సిద్ధమయ్యామని ఆయన అన్నారు.