Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో అపోలో హాస్పిటల్స్ రూ.89.95 కోట్ల లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.49.87 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.2,507.53 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. క్రితం క్యూ3లో రూ.2,921.40 కోట్లకు పెరిగింది. వచ్చే మార్చితో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.5 ముఖ విలువ కలిగిన షేర్‌పై రూ.3.25 డివిడెండ్ అందించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. దీనికి జనరల్ బాడీ ఆమోదం లభించాల్సి ఉంటుంది. గురువారం బిఎస్‌ఇలో అపోలో హాస్పిటల్స్ షేర్ విలువ 0.58 శాతం పెరిగి రూ.1,693.75 వద్ద ముగిసింది.