Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తి జీతం ఇస్తామన్న ఇండిగో
న్యూఢిల్లీ : ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాలన్న నిర్ణయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఉపసంహరించుకున్నది. ఉద్యోగుల వేతనాలు తగ్గించ వద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచనను తాము కూడా అమలు చేయనున్నట్టు ఇండిగో సీఈఓ రొనోజోరు దత్త తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఏప్రిల్ నెల వేతనాల్లో కోత పెట్టుకొనేందుకు స్వచ్ఛందంగా నిర్ణయించారనీ, ఇతర ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కారణంగా విమానయానరంగం పూర్తిగా మూత పడటంతో ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదని ఇండిగో గతంలో ప్రకటించింది. అయితే వేతనాలు తగ్గించవద్దని కేంద్రప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను కోరటంతో తన నిర్ణయాన్ని ఇండిగో వెనక్కు తీసుకున్నది.