Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆర్ధిక సంవత్సరం (2019-20)లో భారత ముడి చమురు ఉత్పత్తిలో 6 శాతం, గ్యాస్‌లో 5 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ఏడాది ఉత్పత్తితో పోల్చితే ఈ క్షీణత నమోదయ్యింది. మార్చిలో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల వారం ఉత్పత్తి నిలిచిపోవడం తగ్గుదలకు ఓ కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి మాసంలో రిలయన్స్ ఇండిస్టీస్ జామ్‌నగర్ ఉత్పత్తిలో 24 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. 2019-20లో మొత్తంగా ముడి చమురు 6 శాతం తగ్గి 31.16 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నది. ప్రయివేటు కంపెనీలు నిర్వహిస్తున్న ప్లాంట్లలో అధికంగా 15.5 శాతం తగ్గుదల నమోదైంది.