Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1000 పాయింట్ల వృద్ధి
ముంబయి : పలు సానుకూల పరిణామాల మధ్య గురువారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రా ట్రేడింగ్‌లో ఏకంగా 1,000 పాయింట్లు పైగా దూసుకెళ్లి తుదకు 997 పాయింట్ల లాభంతో 33,718కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు రాణించి 9,860 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేసినట్టయింది. కరోనా కట్టడికి అమెరికా ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ రూపొందిస్తున్న ఔషధం రెమ్‌డెసివిర్ రెండో దశ క్లినికల్ పరీక్షలలో విజయవంతమైనట్లు వార్తలు రావడం మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచింది. అదే విధంగా ఆర్బీఐ నగదు లభ్యత చర్యలు, దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేయచ్చనే అంచనాలు మరింత మద్దతునిచ్చాయి.