Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 పోస్టాఫీసు ద్వారా లబ్దిదారులు మూడు నెలలలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె. సంధ్యారాణి తెలిపారు. లబ్దిదారులు జిల్లాలోని ఏ పోస్టాఫీసు నుంచైనా ఈ మొత్తాన్ని తీసుకోవడానికి వీలుందనీ, ఇప్పటికే 30 శాతం లబ్దిదారులకు నగదు అందజేశామన్నారు. లబ్దిదారులు ఎవరి పేరుతో రేషన్ కార్డు ఉందో ఆ వ్యక్తి, ఆన్‌లైన్ ప్రింట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని పోస్టాఫీసుకు వచ్చి నగదు తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ బ్యాంక్‌లో వేసిన నగదు కూడా పోస్టాఫీసులో తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు సంధ్యారాణి గురువారం మీడియాకు తెలిపారు.