Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్నాకింగ్ కంపెనీల్లో ఒకటైన మాండలీజ్ ఇండియాకు చెందిన క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ ఉత్పత్తుల్లో 'ధన్యవాదాలు' పేరుతో పరిమిత ఎడిషన్‌ను ఆవిష్కరించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం తమ 70 ఏండ్ల కాలంలో తొలి సారి తన లోగోను 'ధన్యవాదాలు' పదంతో మార్చినట్టు పేర్కొంది. ఈ పరిమిత ఎడిషన్ బార్ విక్రయ మొత్తంలో కొంతభాగాన్ని రోజువారీ కూలీల ఆరోగ్య బీమా పాలసీలకు అందించేందుకు గాను మాండలీజ్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. ఇందుకోసం అసంఘటితరంగంతో కలసి పని చేస్తున్న 'నిర్మాణ' ఎన్జీఓతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్టు పేర్కొంది.