Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మే 17 వరకు విమాన సేవలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించిన నేపథ్యంలో డిజిసిఎ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం డిజిసిఎ జారీచేసిన నూతన సర్క్యులర్ ప్రకారం మే 4 నుంచి 17వ తేదీ వరకు విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు అన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో సర్వీసులకు, ప్రత్యేకంగా తమ అనుమతితో నడుస్తున్న కొన్ని విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తంచదని తెలిపింది.