Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌బిఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్
న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన విషయం వాస్తవమని ఎస్‌బిఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ అన్నారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉంటాయని, డిమాండ్ మాత్రం ఆర్థిక వ్యవస్థలో నిలిచే ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తూనే, దేశంలో ఈ వైరస్ ప్రభావం లేని గ్రీన్ జోన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను కట్టడి చేసేం దుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సరైన చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ నీరసించినా, దేశానికి పెద్ద ప్రమాదం తప్పిం దన్నారు. లేకపోతే వేల మంది ఈ వైరస్ బారిన పడేవారన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు లాక్‌డౌన్ ఎత్తివేయడం ఏ మాత్రం మంచిది కాదన్నారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు అంతంత మా త్రంగానే ఉంటాయన్నారు. అయితే డిమాండ్‌కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండక పోవచ్చన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించేందుకు ఇంకా కొంత సమయం పడుతందన్నారు.