Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజినెస్ బ్యూరో : కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు మిలాప్‌కు భారీగా విరాళాలు అందినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాసియాలో అతిపెద్ద ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ వేదిక అయిన మిలాప్ మార్చి 22న కరోనా సంబంధిత అవసరాల కోసం ప్రత్యేక పేజీ తెరిచింది. ఒక నెలలోనే వేలాది మంది వ్యక్తులు సంయుక్తంగా దాదాపు రూ.90 కోట్ల విరాళాలుగా అందించారని ఆ సంస్థ వెల్లడించింది. వలస కార్మికులతో పాటు ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న అనేక రంగాల్లోని వారికి నిత్యావసరాలు, కమ్యూనిటీ కిచెన్‌ల ద్వారా ఆహారాన్ని అందించినట్లు మిలాప్ కో ఫౌండర్ అధ్యక్షుడు అనోజ్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితమూ ఏదో ఒక రూపంలో ప్రభావితమవుతున్న ఈ కష్టకాలంలో ఇది ఓ ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు.