Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్బ్స్ ఇండియా జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : ఫోర్బ్స్ 2020 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.2.7 లక్షల కోట్ల సంపదతో మరోమారు అగ్ర స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే రూ.99,000 కోట్ల మేర ఆయన సంపద తగ్గినప్పటికీ తొలి స్థానంలోనే ఉన్నారని ఫోర్బ్స్ పేర్కొంది. రిటైల్ చెయిన్ డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్కెట్స్ అధిపతి రాధాకష్ణన్ దామాని రూ.1.3 లక్షల కోట్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు.
గతేడాది కాలంలో దమానీ సంపద 25 శాతం పెరిగింది. హెచ్‌సిఎల్ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్ రూ.89,250 కోట్ల సంపదతో మూడవ స్ధానంలో, రూ 78,000 కోట్లతో ఉదరు కొటక్ నాలుగో స్థానంలో, గౌతం ఆదాని రూ 66,700 కోట్లతో ఐదవ స్ధానంలో ఉన్నారు. భారతి ఎయిర్‌టెల్ వ్యవస్ధాపకుడు సునీల్ మిట్టల్, సైరస్ పూనావాలా, కుమార్ బిర్లా, లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీలు టాప్ 10 బిలియనీర్ల జాబితాలో నిలిచారు. లాక్‌డౌన్‌తో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్స్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గగా బిలియనీర్ల మొత్తం సంపదలో 23 శాతం తగ్గినట్టు వెల్లడించింది.