Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కలర్‌ఒఎస్ 7.1తో భారత మార్కెట్లోకి ఓప్పో ఎక్స్2 సీరిస్‌ను విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇది వరకు ఎప్పుడూ లేని అనుభవాన్ని కలర్ ఒఎస్ 7.1 ఇస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల జీవిత కాలం, సామర్థ్యంను పెంచేలా దీన్ని రూపకల్పన చేసినట్లు ఒప్పో కలర్‌ఒఎస్ సీనియర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌తో పాటుగా భారత వినియోగదారులకు అనుగుణంగా దీన్ని రూపకల్పన చేశామన్నారు. కలర్‌ఒఎస్ 7.1తో జూన్ 27 నుంచి భారత మార్కెట్లోకి ఫైండ్ ఎక్స్2ను అందుబాటులోకి తెచ్చామన్నారు.